రామగుండంను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

by Batti.Sumithra |

ఉత్తర తెలంగాణలోనే ఆదర్శవంతమైన నగరంగా రామగుండం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.

రామగుండంను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
X

దిశ, గోదావరిఖని : ఉత్తర తెలంగాణలోనే ఆదర్శవంతమైన నగరంగా రామగుండం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో ఎమ్మెల్యే పర్యటించి మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీల్లో తిరుగుతూ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రామగుండం ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు.

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్ల పై చెత్త వేయకుండా, డ్రైనేజీల్లో వ్యర్థాలను పడవేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో రామగుండం ప్రాంతాన్ని ఆదర్శవంతమైన, అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Next Story