విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘స్లమ్‌డాగ్’ నుంచి బిగ్ అప్డేట్!

by Mallepaka Hamsa |

ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను జూన్ 8న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘స్లమ్‌డాగ్’ నుంచి బిగ్ అప్డేట్!
X

దిశ, సినిమా: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘స్లమ్ డాగ్’. ఇది ‘33టెంపుల్ రోడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వీరితో పాటు జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై జేబీ నారాయణ రావు కూడా ఈ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను జూన్ 8న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులలో, ముఖ్యంగా విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు టీజర్ కూడా రాబోతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి పూరి జగన్నాథ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, విజయ్ సేతుపతి పవర్‌ఫుల్ యాక్టింగ్ కలగలిసిన ఈ ‘స్లమ్ డాగ్’ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన టాలెంటెడ్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్, బాలీవుడ్ సీనియర్ నటి టబు, కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ కుమార్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story