కర్ణాటకలో ‘పెద్ది’ సెన్సేషన్.. ఆల్ టైమ్ రికార్డ్

by Pulgam srinivas |

కర్ణాటకలో ‘పెద్ది’ ప్రత్యేక ప్రదర్శనలతోనే రూ.3.02 కోట్ల వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.

కర్ణాటకలో ‘పెద్ది’ సెన్సేషన్.. ఆల్ టైమ్ రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగిన సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుండగా, నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ప్రీమియర్ షోలను నిర్వహించారు. ఇక కర్ణాటకలో కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ విశేష స్పందనను దక్కించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా అక్కడి సినిమా వసూళ్ల పరంగా ‘పెద్ది’ కొత్త రికార్డును సృష్టించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రం కర్ణాటక ప్రాంతంలో ప్రత్యేక ప్రదర్శనల ద్వారానే రూ.3.02 కోట్ల వసూళ్లను సాధించి, ఇప్పటివరకు ఎవరూ అందుకోని మొదటి స్థానాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘పుష్ప 2’, ‘ఓజీ’ చిత్రాల ప్రత్యేక ప్రదర్శనల వసూళ్లను కూడా వెనక్కు నెట్టి ‘పెద్ది’ అగ్రస్థానంలో నిలిచినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణంగా కర్ణాటకలో రామ్ చరణ్‌కు ఉన్న అభిమాన వర్గం, అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రభావం కూడా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story