- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లపై సర్కార్ నిషేధం.. ఎక్కడో తెలుసా?
ముస్లింల జనాభాను తగ్గించే పాశ్చాత్య సంస్కృతిపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముస్లింల జనాభాను తగ్గించే పాశ్చాత్య సంస్కృతిపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్, కీలక నగరమైన మజర్ ఈ షరిఫ్ ప్రాంతంలో గర్భనిరోధక మాత్రలు, గర్భనిరోధక సాధనాలు(కండోమ్‌లపై) తాలిబన్లు నిషేధం విధించారు. ఈ మేరకు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గర్భనిరోధక సాధనాలు వాడకూడదంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
ఈ సందర్భంగా ఓ మెడికల్ షాప్ ఓనర్ మాట్లాడుతూ.. తాలిబన్లు తన ఫార్మసీ వద్దకు రెండు సార్లు వచ్చారని గర్భనిరోధక మాత్రలు అమ్మకూడదని గన్‌లు చూయించి బెదిరించినట్లు పేర్కొన్నాడు. మరో ఫార్మసీ యజమాని మాట్లాడుతూ.. తాలిబన్ల హెచ్చరికల నేపథ్యంలో గర్భనిరోధక మాత్రలు అమ్మేందుకు, స్టాక్ ఉంచేందుకు భయపడుతున్నట్లు తెలిపాడు.
Next Story






