- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలూచ్‌పై దాడులు.. మహిళలే సూసైడ్ బాంబర్లు
పాకిస్థాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్సులో 12 వేర్వేరు ప్రాంతాల్లో పాక్ దళాలే టార్గెట్ గా జరిగిన దాడుల వెనుక ఉన్నది తామేనంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్సులో 12 వేర్వేరు ప్రాంతాల్లో పాక్ దళాలే టార్గెట్ గా జరిగిన దాడుల వెనుక ఉన్నది తామేనంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తన సంస్థకు చెందిన ఇద్దరు మహిళలే సూసైడ్ బాంబర్లుగా మారి50 మందిని చంపినట్లు తెలిపింది. ఆసిఫా మెంగల్ (24) దాడిలో పాక్ సిబ్బంది సహా 50 మంది మృతి చెందగా.. మరో మహిళ చేసిన ఆత్మాహుతి దాడిలోనూ అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. రెండో మహిళా బాంబర్ పేరును BLA వెల్లడించలేదు. బలూచిస్థాన్లో భద్రతా దళాలే లక్ష్యంగా హీరోఫ్ పేరుతో రెండోదశ ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు ఆదివారమే ప్రకటించింది.
ఈ దాడులపై పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. ఆత్మాహుతిదాడుల్లో ఇద్దరు మహిళా నేరస్థులున్నట్లు గుర్తించామని తెలిపారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు 40 గంటలుగా ఉగ్రవాదులను ఏరివేస్తున్నారని, ఇప్పటివరకూ 140 మందికి పైగా వేర్పాటు వాదులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు.






