- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంటులో గందరగోళం సృష్టించిన నిందితులకు బెయిల్
2023 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 13న లోక్ సభలో ప్రవేశించి గందరగోళం సృష్టించిన దుండగులకు బుధవారం ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: 2023 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 13న లోక్ సభలో ప్రవేశించి గందరగోళం సృష్టించిన దుండగులకు బుధవారం ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిండే, మహేశ్ కుమావత్ లను రూ. 50 వేల బెయిల్ బాండ్, పూచీకత్తులు సమర్పించాలని, అనుమతి లేనిదే ఢిల్లీ విడిచి వెళ్లరాదని తీర్పునిచ్చింది. బెయిల్ షరతుల్లో భాగంగా ఎలాంటి ఇంటర్వ్యూలు, బహిరంగ ప్రకటనలు చేయొద్దని తెలిపింది.
అసలు అప్పుడు ఏం జరిగిందంటే
పార్లమెంటులో సెక్యూరిటీ వైఫల్యం కారణంగా 2023 డిసెంబరు 13న లోక్‌సభలోకి దుండగులు ప్రవేశించారు. లోక్‌సభలో జీరో అవర్ జరుగుతుండగా.. సాగర్‌శర్మ, మనోరంజన్‌లు పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకారు. పార్లమెంటు లోపల, బయట పసుపు రంగుతో కూడిన పొగ విడుదల చేశారు. వీరు వాటిని తమ బూట్లలో దాచి తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో ఎంపీలను, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో యావత్ దేశం ఉలికి పడింది. పార్లమెంట్ బయట సేమ్ అదే టైంలో అమోల్ షిండే, నీలమ్ లు ఆందోళనకు దిగారు. ఇదే ఘటనకు కారణమైన మరో ఇద్దరు లలిత్ ఝా, మహేశ్ కుమావత్‌లను తర్వాత అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ భద్రతపై తీవ్ర ఆందోళన తలెత్తగా.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ భవన సముదాయంలో భద్రతను (CISF)కు అప్పగించాలని నిర్ణయించుకుంది.






