- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంట్లో రక్తం లేకుండా పుట్టిన బిడ్డ.. కానీ క్షణాల్లో అద్భుతం జరిగింది!
శరీరంలో రక్తం లేకుండా పుట్టిన బిడ్డ ఐదు లక్షల్లో ఒక్క కేసుగా పరిగణ చనిపోతుందనుకున్నా అద్భుతం చేసింది.. వైద్యుల కీలక నిర్ణయంతో ..

దిశ, వెబ్ డెస్క్ : 2009లో ఐర్లాండ్‌లో ఓ అద్భుతం జరిగింది. ఒంట్లో రక్తం లేకుండా పుట్టిన బిడ్డ ఎవరూ ఊహించని విధంగా బతికింది. ఇప్పటికీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంది. ఐదు లక్షల్లో ఒక కేసు ఇలాంటిది జరుగుతుందని దీన్ని ఫీటో మెటర్నల్ హెమోరేజ్ అంటారని చెప్పారు నిపుణులు. ఈ పరిస్థితిలో శిశువు రక్తం తల్లి రక్తప్రవాహంలోకి నిశ్శబ్దంగా చేరుతుంది. దీని కారణంగా శిశువు బాడీలో రక్తం లేకుండా ఉంటుంది. 2009లో పుట్టిన మైసీ విగ్నెస్ కేసులోనూ ఇలాంటిదే కాగా ఆమె రక్తనాళాల్లో ఎర్రరక్తకణాలు లేకుండా కేవలం ప్లాస్మా మాత్రమే ఉందని గుర్తించారు వైద్యులు. పుట్టినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన పాప.. అసలు బతుకుతుందనే నమ్మకం లేదు. కానీ తర్వాత వైద్య చరిత్రలో అద్భుతం జరిగింది. శిశువు శరీరానికి మూడు రెట్లు రక్తాన్ని ఎక్కించారు. కాగా ఈ రక్తమార్పిడి ఆమెకు పునర్జన్మను ఇచ్చింది. కొద్ది రోజులకే అందరు పిల్లల మాదిరిగా సాధారణంగా, ఆరోగ్యంగా జీవించింది.






