చుట్టూ చీకటి.. ఒక్క ఆస్పత్రి లేదు కానీ.. వెనిజులా భూకంపంలో అద్భుతం!

by Naga Rani Yarlagadda |

కటిక చీకటి, ఆస్పత్రి, కనీస వైద్య సదుపాయాలు లేకుండా.. భూకంప బాధితుల అండతోనే నిండు గర్భిణి.. శిథిలాల మధ్యే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

చుట్టూ చీకటి.. ఒక్క ఆస్పత్రి లేదు కానీ.. వెనిజులా భూకంపంలో అద్భుతం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక భూకంపానికి వెనిజులా దేశం అతలాకుతమైంది. ప్రకృతి పగబట్టిందా అన్న రీతిలో సంభవించిన భూకంపానికి.. ఎక్కడ చూసినా కూలిన భవనాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, మరణాలు మిగిల్చిన మాటలంకదని విషాదం కనిపిస్తున్నారు. ఇంతటి మహా విధ్వంసం మధ్య ఒక అద్భుత ఘటన జరిగింది. కటిక చీకటి, ఆస్పత్రి, కనీస వైద్య సదుపాయాలు లేకుండా.. భూకంప బాధితుల అండతోనే నిండు గర్భిణి.. శిథిలాల మధ్యే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తీవ్ర విషాదంలో మునిగిపోయిన అక్కడి వారందరిలో ఈ బిడ్డ జననం రేపటి భవిష్యత్తుపై సరికొత్త ఆశలు చిగురించేలా చేసింది.

మానవత్వమే మంత్రసానిగా మారి..

భూకంపం ధాటికి స్థానిక ఆసుపత్రులు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కనీస వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇలాంటి అత్యంత క్లిష్ట సమయంలో ఓ గర్భిణికి ప్రసవ వేదన మొదలైంది. అయితే.. అక్కడున్న తోటి భూకంప బాధితులు అధైర్యపడలేదు. మానవత్వమే మంత్రసానిగా మారి, ఆమెకు ధైర్యం చెబుతూ విజయవంతంగా ప్రసవం జరిగేలా చూశారు. ఎలాంటి మెడికల్ సపోర్ట్ లేకుండానే ఆ తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంపం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. అదే భూకంపం మధ్యలో ఒక ప్రాణం పోసుకోవడం నిజంగా దేవుడి దయేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మానవాళిని చీకటి రోజులు చుట్టుముట్టినప్పటికీ.. ప్రకృతి ఎంతటి విధ్వంసాన్ని సృష్టించినా, జీవం తన దారిని తాను వెతుక్కుంటుందని నిరూపించడానికి ఈ శిశువు జననమే ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది.

జూన్ 24న వెనిజులాలో కేవలం 39 సెకన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకూ కనీసం 235 మంది మరణించగా.. 4300 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వందలాది మంది ఇప్పటికీ కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.

Next Story