- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్ట్ హిట్టింగ్‌గా ‘ది ఇండియా స్టోరీ’ టీజర్..
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ కోర్టు డ్రామా ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’.

దిశ, సినిమా: కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ కోర్టు డ్రామా ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌లో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే న్యాయం కోసం పోరాడుతూ, పురుగుమందుల ఆధారిత వ్యవసాయం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలను వెలికితీసే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా ఉంది. రోజువారీ ఆహారంలోకి చేరుతున్న విషపూరిత రసాయనాలు, ముఖ్యంగా యువత ఆరోగ్యంపై చూపుతున్న తీవ్ర ప్రభావాన్ని టీజర్‌లో చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. రోజూ కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న పురుగుమందుల ఆధారిత వ్యవసాయం (ఫెస్టిసైడ్ ఫార్మింగ్) సమస్యపై అవగాహన కల్పించడమే ఈ సినిమా లక్ష్యం.
ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ది ఇండియా స్టోరీ’ బలమైన సామాజిక సందేశంతో రూపొందిన సినిమా. ఒక తల్లిగా ఈ కథ నాకు చాలా వ్యక్తిగతంగా కనెక్ట్ అయింది. నేటి తల్లిదండ్రులందరిలో ఉన్న ఆందోళనలు, భయాలను ఇది ప్రతిబింబిస్తుంది. టీజర్ ప్రజలకు తెలియని ఒక వాస్తవాన్ని చూపిస్తుంది. మనం తీసుకునే ఆహారం, అది భవిష్యత్ తరాలపై చూపే ప్రభావం గురించి ఈ సినిమా ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. కాగా.. చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జులై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.






