ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

by Muthe.Rajitha |

ఫిలిప్పీన్స్(Philippines)ను మరోసారి భారీ భూకంపం వణికించింది.

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిలిప్పీన్స్(Philippines)ను మరోసారి భారీ భూకంపం వణికించింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌ లోని మిందనౌ (Mindanao) రీజియన్‌లో శుక్రవారం రిక్టరు స్కేలుపై 6.5 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్టు అధికారులు వెల్లడించారు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) అందించిన నివేదిక ప్రకారం.. ఈ భూకంపం కేంద్రీకృత ప్రాంతంలో 29 కిలోమీటర్ల లోతులో నమోదైంది.

'మిందనౌ'లో హై అలర్ట్స్

భారీ స్థాయిలో భూప్రకంపనలు రావడంతో స్థానిక యంత్రాంగం, భద్రతా అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. భూకంప ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న తీర ప్రాంతాల ప్రజలను అధికారులు ముందస్తుగా హెచ్చరించారు. మరోసారి ప్రకంపనల ముప్పు ఉండే అవకాశం ఉండటంతో ప్రాణాలను రక్షించుకునేందుకు వీలైనంత త్వరగా ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని అక్కడి ప్రజలకు అత్యవసర సూచనలు జారీ చేశారు. ఈ భూకంపం కారణంగా సంభవించిన ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు, భవనాల నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

Next Story