వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి

by Taduka Kalyani |

మహిళ వ్యవసాయబావిలో పడి మృతి చెందిన ఘటన కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి
X

దిశ, కుల్కచర్ల : మహిళ వ్యవసాయబావిలో పడి మృతి చెందిన ఘటన కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కుల్కచర్ల ఎస్ ఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన గొల్ల బాలమ్మ (57) గురువారం వ్యవసాయ పొలానికి వెళ్లి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల బావి వద్ద వెతకగా శుక్రవారం మధ్యాహ్నం ఆమె మృతదేహం బావిలో తేలుతూ కనిపించింది. మృతురాలి భర్త గోల్లారామయ్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఉండగా కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదన్నారు.

Next Story