- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు
ఆన్‌లైన్‌లో పరిచయమైన మైనర్ బాలికను ప్రేమ పేరుతో టార్చర్ చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.

దిశ, అల్వాల్: ఆన్‌లైన్‌లో పరిచయమైన మైనర్ బాలికను ప్రేమ పేరుతో ప్రభావితం చేసి కుటుంబానికి దూరం చేశాడన్న ఆరోపణలతో ఓ యువకుడిపై ఆల్వాల్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధలోని జొన్నబండ సాయినగర్ కాలనీకి చెందిన 17 ఏళ్ల మైనర్ ను ఓల్డ్ ఆల్వాల్‌లోని బతుకమ్మ పార్క్ వద్ద 28 ఏళ్ల మహ్మద్ అఫ్రోజ్ అనే యువకుడితో కలిసి గుర్తించినట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం ఆన్‌లైన్ ద్వారా పరిచయమైన యువకుడు ప్రేమ పేరుతో మైనర్ బాలికను ప్రభావితం చేసి కుటుంబ సభ్యులకు దూరం చేశాడని, బాలిక భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






