- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ ఎస్.డి.డి. కాలనీలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన..
చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరించి కాలనీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు.

దిశ, హన్మకొండ కలెక్టరేట్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సహకారంతో 58వ డివిజన్ పరిధిలోని ఎస్.డి.డి. కాలనీలో కమ్యూనిటీ పార్కు లైన్‌లో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎస్.డి.డి. కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, హనుమకొండ కాలనీల అభివృద్ధి కమిటీల కన్వీనర్ డాక్టర్ నల్లాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాలనీలో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఎస్.డి.డి. కాలనీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని, అయినప్పటికీ మిగిలిన చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరించి కాలనీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో కాలనీలో మిగిలి ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాల పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మహమ్మద్ ముస్తాక్ నేహాల్, 50వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి సుధాకర్, కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు పొన్నోజు వీర బ్రహ్మచారి, ఉపాధ్యక్షుడు తంగళ్ళపల్లి శంకరాచారి, సభ్యులు రాంపల్లి రాజప్రభు, కటకం శివప్రసాద్, నల్ల ప్రసాద్, మిట్టపల్లి సిద్ధారెడ్డి, వనం రమేష్, బాపురావు, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.






