- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు.. ఏర్పాట్లు పూర్తి
సీఎం చంద్రబాబు శనివారం మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరులో పర్యటించనున్నారు. నిర్మాణంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఆయన సందర్శించనున్నారు....

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు శనివారం మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరులో పర్యటించనున్నారు. నిర్మాణంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఆయన సందర్శించనున్నారు. అనంతరం గంటవాని పల్లె వద్ద ఫిడర్ కెనాల్ పనుల పురోగతిని చంద్రబాబు పరిశీలించనున్నారు. ఆ తర్వాత ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం అందజేయనున్నారు.
షెడ్యూల్ ఇదే..
హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు సీఎం బయలుదేరి 10 గంటల 45 నిమిషాలకు వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ అధికారులతో భేటీ అవుతారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన ప్రాజెక్టు సమీపంలోకి వెళతారు. అనంతరం నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేస్తారు. 12 గంటల 35 నిమిషాలకు గిద్దలూరు పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అటు పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.






