- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వారణాసి’పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’.

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ రాజమౌళి. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఆన్సీ ఇంటర్‌నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో పాల్గొన్న ఆయన.. ‘‘వారణాసి’ సినిమా షూటింగ్ మరో నాలుగు నెలల్లో, అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారానికల్లా కంప్లీట్ అవుతుంది. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోయే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణతో పాటు వారణాసిలోని ముఖ్యమైన భాగాల షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతం కేవలం కథను అనుసంధానం చేసే చిన్న చిన్న సన్నివేశాలను మాత్రమే తెరకెక్కిస్తున్నాం. ఈ కథ ఐమాక్స్ స్క్రీన్‌పై చూస్తేనే అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని మేము ముందుగానే భావించాము. అయితే ఈ ఫార్మాట్ కోసం కథలో ఎలాంటి ప్రధాన మార్పులు చేయలేదు. సాంకేతిక పరమైన సర్దుబాట్లు మాత్రమే చేశాము. ‘అనోమార్ఫిక్ ఫ్రేమింగ్’ పద్ధతిని ఉపయోగించి దృశ్యాలను చిత్రీకరించాము. దీని కోసం మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డా తర్వాత ఈజీగా సాగింది’ అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్‌తో సినిమాపై హైప్ పెరిగింది.






