- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోశమ్మ మహామాత మహోత్సవాలకు లక్ష విరాళం..
by Kodari Anjali |
పోశమ్మ మహామాత మహోత్సవాలకు గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ లక్ష విరాళం అందజేశారు.

X
దిశ, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలోని శ్రీ పోశమ్మ మహామాత మహోత్సవాలకు గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ లక్ష రూపాయల విరాళం మాదిగ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ బాలరాజు నరసాగౌడ్ కు మాదిగ సంక్షేమ సంఘం కృతజ్ఞతలు తెలిపారు. బండలింగంపల్లి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ పోశమ్మ మహామాత మహోత్సవాలకు గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ కు మాదిగ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. గ్రామ సర్పంచ్ బాలరాజు నరసాగౌడ్ మాట్లాడుతూ.. ఆహ్వానాన్ని స్వీకరించి, మహోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
Next Story






