- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > రొట్టెల పండగలో మాజీ ఎంహెచ్‌వో.. అనధికారికంగా విధులపై విమర్శలు
రొట్టెల పండగలో మాజీ ఎంహెచ్‌వో.. అనధికారికంగా విధులపై విమర్శలు
by Vemula.Srinu Prasad |
నెల్లూరు కార్పొరేషన్‌లో ఎంహెచ్‌వోగా పని చేసిన అధికారి ఇప్పుడు అనధికారికంగా రొట్టెల పండుగ పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలకు హాజరయ్యారు. ...

X
దిశ, నెల్లూరు సిటీ: నెల్లూరు కార్పొరేషన్‌లో ఎంహెచ్‌వోగా పని చేసిన అధికారి ఇప్పుడు అనధికారికంగా రొట్టెల పండుగ పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయనకు అక్కడ విధులు నిర్వహించాలని ఎలాంటి ఉత్తర్వులు లేవు. అయినా నన్ను ఎవరు ఏమి చేయలేరంటూ అనధికారికంగా రొట్టెల పండుగ విధులకు హాజరై ప్రజారోగ్య విభాగం అధికారులపై పెత్తనం చేస్తున్నారు. అసలు ఎంహెచ్ఓ ఏమో తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఆ మాజీ వెనుక తిరుగుతున్నారు. ఆ మాజీ ఎంహెచ్‌వోనే కాకుండా రిటైర్ అయిపోయిన ఓ వ్యక్తి రొట్టెల పండుగ జరుగుతున్న బారాషహీద్ దర్గా ప్రాంగణంలో దుకాణాల మీద దాడులు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. వీళ్ళని అక్కడ డ్యూటీలు ఎవరు చేయమన్నారనేది చిదంబర రహస్యంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించాల్సి ఉంది
Next Story






