అంగన్వాడీ నియామకాలపై బురదజల్లే ప్రయత్నమే..బీఆర్ఎస్‌పై ఇందిరా శోభన్ ఆగ్రహం

by Ajay Maddhiboyina |

అంగన్వాడీ నియామకాల్లో ఇంటర్వ్యూల విధానంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ ఖండించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే నియామకాలను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు.

అంగన్వాడీ నియామకాలపై బురదజల్లే ప్రయత్నమే..బీఆర్ఎస్‌పై ఇందిరా శోభన్ ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : అంగన్వాడీ నియామకాల్లో ఇంటర్వ్యూల విధానంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ ఖండించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే నియామకాలను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాజీమంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల మానసిక పరిపక్వత, పిల్లల పట్ల సున్నితత్వాన్ని పరిశీలించేందుకే కలెక్టర్ల నేతృత్వంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, ఇది పూర్తిగా పారదర్శకమని స్పష్టం చేశారు.

అభ్యర్థి సాధించే మొత్తం మార్కుల్లో కేవలం 10 శాతం మాత్రమే ఇంటర్వ్యూలకు ఉంటాయని, మిగిలిన 90 శాతం మార్కులు విద్యార్హతలు, సామాజిక అర్హతల ఆధారంగానే ఉంటాయని తెలిపారు. మంత్రి సీతక్కకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్లను కోర్టుల ద్వారా అడ్డుకున్న చరిత్ర బీఆర్ఎస్‌ది అని, ఇప్పుడు కూడా నిరుద్యోగుల నోటి కాడి ముద్దను లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Next Story