- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం
రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని,ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ,శాలిగౌరారం : రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని,ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శాలిగౌరారం చెరువు నుంచి సాగునీటి విడుదల కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి,చెరువు క్రస్ట్ గేట్ల ద్వారా అధికారికంగా నీటిని కిందకు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ,రైతాంగానికి అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.శాలిగౌరారం చెరువు కింద ఉన్న వేలాది ఎకరాల ఆయకట్టుకు ఈ నీటి విడుదలతో సాగునీరు అందడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో బిఎల్ ఏ ల పాత్ర కీలకంగా ఉంటుందని,రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు కావడం, అనర్హుల పేర్ల తొలగింపు వివరాల సవరణ వంటి అంశాలపై బిఎల్ఎలు అప్రమత్తంగా ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి ఘన స్వాగతం పలికిన స్థానిక సర్పంచ్ చాడ కవిత సురేష్ రెడ్డి,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు,సూర్యాపేట డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య,మండల అధ్యక్షులు కందాల సమరం రెడ్డి,డిసిసి ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్,పాదూరి శంకర్ రెడ్డి, చామల మహేందర్ రెడ్డి,నూక కిరణ్ యాదవ్,చింత ధనుంజయ,తహసీల్దార్ మాధవరావు,ఎస్ ఐ సైదులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






