రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం.. మరొకరికి గాయాలు

by Kodari Anjali |

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని చింతగూడెం గ్రామ సమీపంలో జరిగింది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం.. మరొకరికి గాయాలు
X

దిశ, కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని చింతగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం రోజున రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగారం గ్రామానికి చెందిన మట్టి మహేష్ (23) సర్వాయి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కలిసి వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అది అతివేగంగా వచ్చి అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై వెంకటేష్ తెలిపారు.

Next Story