- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రమాదంలో ఉన్న తెలంగాణ అస్తిత్వంపై ప్రజల్లో మరింత చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ వాదులు పేర్కొన్నారు. అవగాహన చేసేందుకు విస్తృతమైన సదస్సులు, సమావేశాలు వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించాలని పేర్కొన్నారు. శుక్రవారం సోమాజి గూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ అస్తిత్వం అంశంపై రౌండౌ టేబుల్‌సమావేశం జరిగింది. ఈసమావేశంలో పలు వక్తలు పాల్గొన్ని దేశం ముందు తెలంగాణ విఫల రాష్ట్రంగా చేయడానికి ఆంధ్ర రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారు.హైదరాబాద్ పై నిరంతరం ఆంధ్ర నార్త్ ఇండియా రాజకీయ నాయకులు చేసే కుట్రాలపై నిరంతరం ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమాలు చేపట్టాలి. గోదావరి కావేరి లింక్ పైన కృష్ణా నదిపై కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ నిర్మిస్తున్న అక్రమ బ్యారేజీలు ఇతర ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం నిలదీయాలని డిమాండ్‌చేశారు. విగ్రహాలను ఏర్పాటు చేయడం దగ్గరనుంచి బతుకమ్మను తీసేయడం వరకు తెలంగాణ ఉనికికి ప్రమాదమే కనిపించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఏపీ నాయకుడు తెలంగాణ ఎవరు జాగిరు అనడం కూడా అందులో భాగమే ఇది అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది. తెలంగాణ వ్యతిరేకులు ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల ముసుగులో వస్తున్నారు. టిడిపి అంటే తెలుగుదేశం కాదు ఆంధ్రదేశం అని పెట్టుకోవాలి.
ఏపీ నుంచి తెలంగాణ విడిపోతే ఎలా బతుకుతుంది అని ప్రశ్నించిన వాళ్లకు తెలంగాణ ఒక సమాధానం అన్నారు. ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం ఆంధ్ర ఉద్యోగులను ఎలా తీసుకు రాగలుగుతుందన్నారు. తెలంగాణపై జరుగుతున్న దాడిని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలి. తెలంగాణ మీ అయ్య జాగిర్ కాదని అనడం మనం ఉనికిని ప్రశ్నించడమే అవుతుంది. తెలంగాణ వ్యవసాయాన్ని బతికించుకోని ఆంధ్ర పంటలు మన దగ్గర పండించొద్దు. తెలంగాణ భూముల కనుగుణంగా పండగ పండించాలి.పాలకుడే తెలంగాణ అస్థిపంపై దాడి చేస్తున్నాడు. ఉద్యమ వ్యతిరేకి రేవంత్ రెడ్డి ఉద్యమకారులపై ప్రతి కారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర వారిపై దాడి జరిగితే ఎవరు బాధ్యులు. తెలంగాణ ఉనికిపై జరుగుతున్న దాడిని సమాజం తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, శ్రీదర్ రావు దేశ్ పాండే, తుల్జారాం సింగ్, నిందిని సిద్దా రెడ్డి, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, ఉద్యమకారుడు దూదిమెట్ల బాలరాజు, సీనియర్ ఎడిటర్ టంకశాల అశోక్, సీనియర్ జర్నలిస్టులు నర్రా విజయ్, గొర్ల బుచ్చన్న, సరితా యాదవ్, బండారు రామ్మోహన్ రావు పాల్గొన్నారు.






