- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిమెంట్ లారీ బోల్తా.. ఒకరు మృతి
by Kodari Anjali |
అదుపుతప్పి లారీ బోల్తా పడి ఒకరు మరణించిన ఘటన నవాబుపేట గ్రామం వద్ద జరిగింది.

X
దిశ, లింగాలఘణపురం: అతివేగంగా వస్తున్న లారీ మూలమలుపు వద్ద కంట్రోల్ కాకపోవడంతో డ్రైవర్ దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతనిపైన లారీ బోల్తా పడడంతో డ్రైవర్ రుషికేష్ కైలాస్ మార్ఖండ్ (30) మృతి చెందిన సంఘటన మండలంలోని నవాబుపేట గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిమెంటు లోడుతో సూర్యాపేట నుండి జనగామ వైపు వేగంగా వస్తున్న లారీ, మండలంలోని నవాబుపేట గ్రామం వద్ద ఉన్న మూలమలుపు వద్ద, అదుపుతప్పడంతో డ్రైవర్ బండిలో నుండి కిందకు దూకినప్పటికీ లారీ కూడా అతనిపై బోల్తా పడినట్టు తెలిపారు. దీంతో డ్రైవర్ రుషికేష్ కైలాస్ మార్ఖండ్‌పై సిమెంట్ బస్తాలు పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు.
Next Story






