యువకుడు అనుమానస్పద మృతి

by Taduka Kalyani |

యువకుడు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది

యువకుడు అనుమానస్పద మృతి
X

దిశ, చైతన్యపురి : యువకుడు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్ పెక్టర్ కె. సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామానికి చెందిన ఓరుగంటి శ్రీనివాస్ కుమారుడైన సాయికిరణ్ (28) కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సాయికిరణ్ 14 ఏండ్లుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 25న ఉదయం 10 గంటలకు సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఒక వివాహ వేడుకకు వెళ్లాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చి రాత్రి భోజనం చేసి మళ్లీ 10 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. ఇంటి దగ్గర్లో స్పృహ తప్పి పడిపోగా అతని స్నేహితుడు అనిల్ చూసి వెంటనే తన బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చేసరికే ఫిర్యాదుదారుడి కుమారుడు స్పృహ కోల్పోయి ఉండడంతో వారు వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఓమ్ని ఆసుపత్రిలో వైద్యులు ఈ నెల 26 అర్ధరాత్రి ప్రాంతంలో పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. ఈ మేరకు మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.

Next Story