- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్కెట్లోకి జొన్నగిరి బంగారం
దేశీయ బులియన్ మార్కెట్‌లో 'మేడిన్ ఆంధ్రా' బంగారు బిస్కెట్లు సరికొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : దేశీయ బులియన్ మార్కెట్‌లో 'మేడిన్ ఆంధ్రా' బంగారు బిస్కెట్లు సరికొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న జొన్నగిరి ప్రాంతంలో బంగారు గనుల తవ్వకాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, జొన్నగిరి గనుల నుండి వెలికితీసిన స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన 'జొన్నగిరి బంగారు బిస్కెట్లు' బులియన్ మార్కెట్లో అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి.
ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్
ఈ జొన్నగిరి బంగారు బిస్కెట్లపై ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర మ్యాప్‌ను ముద్రించడం విశేషం. ఇది స్థానిక మార్కెట్‌లో, కొనుగోలుదారులలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మన సొంత రాష్ట్ర గనుల నుండి వచ్చిన బంగారం కావడం, దానికి తోడు ఏపీ మ్యాప్ ముద్రించి ఉండటంతో వీటికి మార్కెట్‌లో ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ లభిస్తోంది. పసిడి ప్రేమికులు, పెట్టుబడిదారులు ఈ సరికొత్త ఆంధ్రా గోల్డ్ బిస్కెట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.






