- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, పరిగి : మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నేడు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఉత్తకోతలే కూస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పు పట్టారు. పరిగి లో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అధ్యక్షతన ఎస్ గార్డెన్స్ లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై బి ఎల్ ఓ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు రైతు బంధు( భరోసా డబ్బులు )పడక, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయక అవస్థలకు గురి చేస్తుందన్నారు. ఎన్నికల ముందు 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టారన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపోకండి గోసపడతారని చెప్పినా వినకుండా మార్పు కావాలి అంటూ రైతుబంధు ప్రభుత్వాన్ని ఓడ గొట్టి రాబందుల ప్రభుత్వాన్ని గెలిపించి అవస్థలు అనుభవిస్తున్నది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. పరిగి నియోజకవర్గంలోని రాకంచెర్ల ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కాలాపూర్, రాపోల్ గ్రామాల్లోని అసైన్డ్, పట్టా భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల భూములను లాక్కోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆ పని చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా
తెలంగాణలోని కోటి 67 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.1.50 లక్షలు జమ చేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సమక్షంలో కేటీఆర్ అన్నారు. రైతుబంధు కింద ఎకరానికి రూ.15 వేల చొప్పున, మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అయితే ఆ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్న అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అధికారులు, పోలీసులు విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అతిగా వ్యవహరిస్తే సహించబోమన్నారు. అనంతరం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై బీఎల్‌వోలకు సూచనలు చేశారు. ఓటర్లు తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పరిగి నియోజకవర్గాన్ని జిల్లాలో నంబర్ వన్‌గా నిలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగి ఉంటే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తై పరిగి, చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతాలకు ఇప్పటికే సాగునీరు అందేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్లిందని, ఉద్దండాపూర్ నుంచి కాలువల పనులు చేపడితే రెండేళ్లలో నీరు అందించవచ్చని అన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు.






