- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ మహమ్మారిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
డ్రగ్స్ ఒక వ్యక్తికో లేదా ఒక కుటుంబానికో పరిమితమైన సమస్య కాదని, ఒక తరాన్ని దెబ్బతీస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ట్వీట్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: డ్రగ్స్(Drugs) ఒక్క వ్యక్తికో లేదా ఒక కుటుంబానికో పరిమితమైన సమస్య కాదని, ఒక తరాన్ని దెబ్బతీస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ట్వీట్ చేశారు. చాలా కుటుంబాలలో డ్రగ్స్ చీకట్లు నింపుతోందని, సమాజ పునాదులనే కదిలిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ లేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. డ్రగ్స్ వ్యసనాల నుంచి యువతను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. క్షణికానందం కోసం డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితాలే నాశనమైపోతాయన్నారు. క్రమశిక్షణ, నైతిక విలువలు, గౌరవప్రదమైన జీవన విధానం వైపు యువతను నడిపించగలిగితేనే ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించగలమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఎవరైనా డ్రగ్స్‌కు బానిసైతే..
ఇంట్లో ఎవరైనా డ్రగ్స్‌కు బానిసైతే ఆ కుటుంబం మొత్తం మానసిక, ఆర్థిక నరకాన్ని అనుభవిస్తుందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల ద్వారానే కాకుండా, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతోనూ డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయగలుగుతామని ఆయన వ్యాఖ్యానించారు. డ్రగ్స్ నిర్మూలనపై యుద్ధం ప్రకటించాలన్నారు. ఇందుకోసం అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్రగ్స్ లేని నవసమాజ స్థాపనకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు సైతం ముందుకు రావాలని, అలా సాగించే ప్రతి ప్రయత్నానికి తాను పూర్తి మద్దతు ఇస్తానని చెప్పారు. మత్తు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.






