మింగుడు పడని లోకేష్ సీఎం నినాదం.. అంతు పట్టని పవన్ వ్యూహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-26 15:32:20  IST  )

ఏపీ రాష్ట్రంలో 2024 కు ముందు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ అని, ప్రజలు ఇబ్బందులుకు గురవుతున్నారని తాను సీఎం అవ్వడం ప్రధానం కాదని ప్రజలను వైసిపి ప్రభుత్వం నుంచి రక్షించడానికి కూటమి ప్రభుత్వంలో చేరానని పవన్ కళ్యాణ్ చెప్పిన, చెబుతున్న విషయం విదితమే...

మింగుడు పడని లోకేష్ సీఎం నినాదం..  అంతు పట్టని పవన్ వ్యూహం
X

దిశ,పాలకొల్లు: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్తు అంతర్గత వ్యూహం అంతు పట్ట లేకుండా ఉంది. ఏపీ రాష్ట్రంలో 2024 కు ముందు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ అని, ప్రజలు ఇబ్బందులుకు గురవుతున్నారని తాను సీఎం అవ్వడం ప్రధానం కాదని ప్రజలను వైసిపి ప్రభుత్వం నుంచి రక్షించడానికి కూటమి ప్రభుత్వంలో చేరానని పవన్ కళ్యాణ్ చెప్పిన, చెబుతున్న విషయం విదితమే. అయితే పవన్ కళ్యాణ్ అసలు భవిష్యత్ అంతర్గత ప్రణాళిక ఏంటనేది తెలియకపోవడంతో అటు కాపు సంఘాల నేతలు, ఇటు జనసేన శ్రేణులు డోలయనంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణాళిక చిదంబర రహస్యం తెలియకపోవడంతో ఈ రెండు వర్గాలు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. వారే కాకుండా టిడిపి,బిజెపి శ్రేణులు కూడా అంతర్మాదనం లో పడ్డాయని సమాచారం.

15 సంవత్సరాలు గడువు ఇద్దరి మధ్య రహస్య ఒప్పందమా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిసారి సీఎంగా చంద్రబాబు 15 సంవత్సరాల పాటు ఉండాలని చెబుతుండడంతో కాపు సంఘాలు, జన సేన శ్రేణులు లో తీవ్ర చర్చ నీయాంశం గా మారింది. 15 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ కి సీఎంగా అవకాశం కల్పిస్తానని వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందమా? ఏమిటి అనేది కాపు సంఘాలు నేతలు, జనసేన శ్రేణులు తీవ్ర చర్చకు వేసినట్లు తెలిసింది. అందుకే ప్రతిసారి 15 సంవత్సరాలు అనే మాట పవన్ కళ్యాణ్ అంటున్నారు ఏమోనని అనుమానాలు ఉన్నాయని పలువురు అంటున్నారు.

జాతీయ, రాజకీయాల్లో పాల్గొనడంపై చర్చ

పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడంపై కూడా కాపు సంఘాలు జనసేన శ్రేణులు లో చర్చకు తెరలేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా స్థాయి నేతలతో నిత్యం టచ్ లో ఉండడం కూడా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి కేంద్ర మంత్రి గా అయి పోతారా లేదా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటారా అనేది కూడా కాపు, జనసేన శ్రేణులు మధ్య సంఘాలు చర్చకి తెరలేసినట్టు సమాచారం.

మింగుడు పడని లోకేష్ సీఎం నినాదం

టిడిపి వర్గాల్లో పలువురు అచ్యుత్సాహకులు నెక్స్ట్ సీఎం లోకేష్ అని పదేపదే ప్రకటించడంతో ఏపీ లోని కాపు సంఘ నేతలు, జనసేన శ్రేణులకు మింగుడు పడని పరిస్థితి నెలకొంది. జైల్లో ఉన్న చంద్రబాబును తీసుకొచ్చి సీఎం అవ్వడానికి కారకుడైన పవన్ కళ్యాణ్‌కి నెక్స్ట్ సీఎం అవకాశం ఇస్తారా, లేక లోకేష్‌కి ఇస్తారా అంటూ కాపు సంఘాలు, జనసేన శ్రేణులు మండిపడుతున్నట్లు సమాచారం. సీఎం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి లోకేష్‌కి ముఖ్యమంత్రి ఇవ్వాలని కోరడమేమిటిని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

100 సీట్లు కోసం ఒత్తిడికై సిద్ధం

రాబోయే 2029 ఎన్నికల్లో 100 సీట్లు కూటమి పార్టీ నుండి జనసేన పార్టీకి తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు కాపు సంఘాల ప్రతినిధులు, జనసేన శ్రేణులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇలా చేస్తే తమిళనాడులో విజయ్ సాధించిన విజయం మాదిరిగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి ఉంటాయని దీనికోసం ఆరు నూరైనా కూటమి పార్టీని ఒప్పించాలని ఈ రెండు వర్గాలు అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే అవసరమైతే పవన్ కళ్యాణ్‌తో తెగ తెంపులు చేసుకోవడానికైనా వెనుకాడబోమని ఈసారి పవన్ కళ్యాణ్‌కు చెప్పాలని యోచనలో కాపు సంఘాలు నేతలు, జనసేన శ్రేణులు గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే భవిష్యత్తులో రాజకీయ సమీకరణలు ఎలా మారతాయి అనేది వేచి చూడాల్సిందే మరి.

Next Story