భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

by Muthe.Rajitha |

తెలంగాణ వ్యాప్తంగా రానున్న వారం రోజుల్లో వాతావరణంలో భారీ మార్పులు ఉండబోతున్నట్టు భారత వాతావరణ విభాగం(IMD) హెచ్చరికలు జారీ చేసింది.

భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా రానున్న వారం రోజుల్లో వాతావరణంలో భారీ మార్పులు ఉండబోతున్నట్టు భారత వాతావరణ విభాగం(IMD) హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ అధికారికంగా ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. ఈ వర్షాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో, రాజధాని హైదరాబాద్ సహా చాలా జిల్లాలకు ప్రస్తుత పరిస్థితులను బట్టి యెల్లో అలర్ట్ (Yellow Alert) కూడా జారీ చేసారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రేపటి నుండి ప్రారంభమై జూలై 2 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే ఏడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా, రాబోయే 48 గంటల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని, దీనివల్ల నగర ప్రజలు ప్రయాణాల పరంగా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త

వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది. వర్షం పడే సమయంలో ఈదురు గాలుల తీవ్రత మరియు ఉరుములు, మెరుపుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.

Next Story