- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలైవా 173లో ఆఫర్ అందుకున్న యంగ్ హీరోయిన్!
సూపర్ స్టార్ రజినీకాంత్ తన 173వ చిత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ తన 173వ చిత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తాజాగా ‘ధర్మన్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో రజినీకాంత్ ‘ది డెడ్లీ డాక్టర్’ అవతారంలో కనిపించనున్నట్లు తెలుపుతూ.. న్యాయాన్ని గెలిపించే ఓ వైద్యుడిగా ఆయన పాత్ర చాలా వైవిధ్యంగా, పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని హిట్ ఇచ్చారు మేకర్స్. దీంతో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఇక త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ‘ధర్మన్’కు సంబంధించి తాజాగా మరో అప్డేట్ కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఇప్పటికే సీనియర్ నటి సిమ్రాన్, యంగ్ బ్యూటీ రాశి ఖన్నా భాగం అయినట్లు తెలుస్తుండగా.. తాజాగా మీనాక్షి చౌదరి కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయిందని సమాచారం. ప్రస్తుతం డైరక్టర్ అశ్వత్ మారిముత్తు తమిళ స్టార్ శింబుతో ‘STR51’ కోసం వర్క్ చేస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా లాక్ చెయ్యగా.. ఇప్పుడు రాబోయే తలైవా 173లో కూడా ఎంపిక చేశారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






