ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు.. వ్యక్తి దుర్మరణం

by Kodari Anjali |

మోహన్‌రావుపేట గ్రామ శివారులో శుక్రవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు.. వ్యక్తి దుర్మరణం
X

దిశ, కోరుట్ల రూరల్: మండలంలోని మోహన్‌రావుపేట గ్రామ శివారులో శుక్రవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కరీంనగర్ నుంచి మెట్‌పల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, మోహన్‌రావుపేట నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహన దారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story