- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య ట్రస్ట్‌లో వందల కోట్ల అవినీతి: ఎంపీ చామల
అయోధ్య ట్రస్ట్‌లో వందల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ చైర్మన్ చంపత్ రాయ్ నిన్నటి వరకు ఎలాంటి అవినీతి జరగలేదని బుకాయించారన్నారు.

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య ట్రస్ట్‌లో వందల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ చైర్మన్ చంపత్ రాయ్ నిన్నటి వరకు ఎలాంటి అవినీతి జరగలేదని బుకాయించారన్నారు. కానీ ఆయన సొంత మనుషులనే 8 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పారు. ప్రజల సెంటిమెంట్ అడ్డుపెట్టుకుని భారతదేశంలోని మారుమూల గ్రామాల నుండి కూడా చందాలు వసూలు చేశారని అన్నారు. అలా వసూలు చేసిన చందాలలో స్కామ్ చేయడం దారుణం అని వ్యాఖ్యానించారు. స్కామ్ బయటపడ్డాక చంపత్ రాయ్ రాజీనామా చేశారని, ఇంతటితో ముగిసిపోయిందని బీజేపీ వాళ్లు ఉంటారన్నారు. కానీ యూపీ సీఎం యోగి అధిత్యానాథ్ కూడా రాజీనామా చేయాల్సిందేనని చామల డిమాండ్ చేశారు.
ఇది కేవలం ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వ్యవహారం కాదని యావత్ భారతదేశం నుండి ప్రజల సెంటిమెంట్ వాడుకుంది డబ్బులు దోచుకునేందుకా అని ప్రశ్నించారు. 2వేల కోట్ల అక్రమాలు జరిగాయని గతంలో కూడా ఆరోపణలు వచ్చాయని చెప్పారు. వసూలు చేసిన చందాలను కూడా పాదర్శకంగా చూపించలేదని విమర్శించారు. వసూలు చేసిన డబ్బులను ఎలా ఖర్చు పెడుతున్నారో బీజేపీ చెప్పాలని అన్నారు. మమతా బెనర్జీ దగ్గర నుండి 20 మంది ఎంపీలను, శివసేన నుండి ఆరుగురు ఎంపీలను కొనుగోలు చేశారని, ఒక్కొక్కరికి 70 నుండి 80 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారని ఆరోపించారు. దోచుకున్న డబ్బుతోనే ఎంపీలను కొనుగోలు చేశారా అని ప్రశ్నించారు. రాముడి పేరుతో దోచుకున్న డబ్బును ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి వాడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.






