అదృశ్యమైన మహిళ హత్య కేసు ఛేదన

by Taduka Kalyani |   (  Updated:2026-06-26 13:35:34  IST  )

అదృశ్యమైన మహిళ హత్య కేసును రాయికోడ్ పోలీసులు ఛేదించారు. మెడలో బంగారు గుండ్ల కోసం బావిలో తోసి హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

అదృశ్యమైన మహిళ హత్య కేసు ఛేదన
X

దిశ, రాయికోడ్ : అదృశ్యమైన మహిళ హత్య కేసును రాయికోడ్ పోలీసులు ఛేదించారు. మెడలో బంగారు గుండ్ల కోసం బావిలో తోసి హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్ర పరిధిలోని సింగీతం గ్రామానికి చెందిన ఉప్పరి లలిత (53) ఈ నెల 17 న తప్పిపోయింది. ఈ నెల 20 న సింగీతం గ్రామ శివారులోని శశికాంత్ పాటిల్ వ్యవసాయ బావిలో శవం లభ్యమైంది. అయితే మెడలో బంగారు గుండ్లు కనిపించలేదు. ఆమె చనిపోయిన రోజు నుంచి నిందితుడు అదే గ్రామానికి చెందిన ముక్కని భాస్కర్ కనిపించలేదు. బంగారు గుండ్ల కోసమే హత్య చేసి ఉంటారేమోనని కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ముక్కని భాస్కర్ పై అనుమానం రావడంతో నిదితుడిని విచారణ చేయగా మెడలో బంగారు గుండ్ల కోసమే బావిలో తోసి హత్య చేశానని అంగీకరించాడని జహీరాబాద్ రూరల్ సిఐ హన్మంతు, ఎస్ఐ చైతన్య కిరణ్ వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపించారు.

Next Story