- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి అడ్లూరి
ఏఎన్ఎం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

దిశ, బీర్ పూర్: ప్రజలు ఆశీర్వదించి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావడానికి అనేక చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చోరవతో జగిత్యాల జిల్లాలో సర్కారు వైద్యాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ నిర్మాణంతో పాటు 450 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తా..
జగిత్యాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రాన్ని మెడికల్ హబ్ గా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. బీర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లతో పాటు సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అడగకుండా నే ప్రమాద బీమా కల్పించిందని రాష్ట్రంలోని ఏఎన్ఎంలు ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మారు మూల మండలమైన బీర్ పూర్ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి తెలిపారు అంతకు ముందు బీర్ పూర్ లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ మారుమూల మండలాల అభివృద్ధి కోరకు ప్రత్యేక నిధులు సాధించి మారుమూల మండలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఏడాదిలోని బీర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు
జగిత్యాల జిల్లా కేంద్రాన్ని వైద్య సేవలకు నిలయంగా మార్చడానికి చేస్తున్న కృషికి మంత్రి అడ్లూరితో పాటు ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం లభిస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య సేవలు అందిస్తామని రానున్న రోజుల్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. ఏడాదిలోని బీర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు పూర్తి చేశామని అన్నారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలను బీర్పూర్‌లో అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరీష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, పిఎసిఎస్ జిల్లా డైరెక్టర్ ముప్పాల రామచందర్రావు, ఎంపీడీవో భీమేష్, ఎమ్మార్వో సుజాత, ఎస్సై రాజు, సర్పంచులు నాయకులు ఆశాలు, అంగన్వాడీలు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






