- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందింది వీళ్లే..6గురు సైనికుల పేర్లు వెల్లడించిన ప్రభుత్వం
భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ యుద్దంలో మరణించిన సైనికుల వివరాలను కేంద్రం వెల్లడించింది. యుద్ధంలో సాయుధ దళాల నుండి మొత్తం ఆరుగురు మరణించినట్టు మొదటిసారి బహిర్గతం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ యుద్దంలో మరణించిన సైనికుల వివరాలను కేంద్రం వెల్లడించింది. యుద్ధంలో సాయుధ దళాల నుండి మొత్తం ఆరుగురు మరణించినట్టు మొదటిసారి బహిర్గతం చేసింది. వీరమరణం పొందినవారిలో సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (ఇండియన్ ఆర్మీ), రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్, వీర చక్ర (ఇండియన్ ఆర్మీ), లాన్స్ నాయక్ దినేష్ కుమార్ (ఇండియన్ ఆర్మీ), ఏవియేషన్ టెక్నీషియన్ మూడ్ మురళీనాయక్ (ఇండియన్ ఎయిర్ ఫోర్స్), హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ (ఇండియన్ ఆర్మీ), సార్జెంట్ సురేంద్ర కుమార్, (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) ఉన్నారు.
దేశ సేవలో ప్రాణాలను అర్పించిన వీరి పేర్లను జాతీయ యుద్ధ స్మారక వెబ్ సైట్‌లోని గౌరవ పట్టికలో చేర్చడంతోపాటు ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలోని 3డీ వాల్ పై కూడా లిఖించారు. ఆపరేషన్ సింధూర్ జరిగి చాలా కాలం అవుతున్నా ఇప్పటి వరకు మరణించిన వీరుల పేర్లను కేంద్రం వెల్లడించలేదు. తాజాగా వారి పేర్లను ప్రకటించడం (రోల్ ఆఫ్ హానర్) దేశం కోసం ప్రాణాలు అర్పించినవారి జాబితాలో చేర్చడాన్ని సూచిస్తోంది. ఇదిలా ఉంటే పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 భారత పైరులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినదానికి ప్రతిస్పందనగా మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించారు. యుద్దంతో సైన్యం విరోచితంగా పోరాడి పాకిస్థాన్ కు చెమటలు పట్టించింది.






