- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ వివాదం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
భూ వివాదానికి సంబంధించిన వేధింపులు తట్టుకోలేక ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, కొండపాక: భూ వివాదానికి సంబంధించిన వేధింపులు తట్టుకోలేక ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుద్దెడ గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్, ప్రస్తుత వార్డు సభ్యుడు గుండెల్లి ఆంజనేయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గ్రామంలో విక్రయించిన ఓ భూమికి సంబంధించి గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇటీవల అదే భూమి వ్యవహారంలో ఆయనతో పాటు పలువురిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 6న ఈ కేసులో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆంజనేయులు తన మొబైల్ ఫోన్లను ఇంట్లోనే ఉంచి మోటార్‌సైకిల్‌పై బయటకు వెళ్లాడు. కొంతసేపటికి ఆయన కనిపించకపోవడంతో భార్య సంధ్యారాణి, కుమార్తె ప్రసన్నలక్ష్మి బంధువులు, పరిచయస్తులను ఆరా తీశారు. అనంతరం తన ఫామ్‌హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు, దానిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూ వివాదానికి సంబంధించి కొందరు వేధింపులకు గురిచేయడం వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుడి భార్య సంధ్యారాణి ఆరోపించారు.






