- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పౌరసత్వాన్ని నిర్ణయించేది అవే.. అసదుద్దీన్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
‘భారత పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ప్రామాణికం కాదంటే మరి బీజేపీ సభ్యత్వం ప్రామాణికమవుతుందా...? అంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: ‘భారత పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ప్రామాణికం కాదంటే మరి బీజేపీ సభ్యత్వం ప్రామాణికమవుతుందా...? అంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పాస్ పోర్ట్ ఒక్కటే పౌరసత్వానికి ప్రామాణికం కాదన్నారు. పౌరసత్వంపై అసదుద్దీన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. బారిస్టర్ అయ్యి చట్టవిరుద్దంగా మాట్లాడటం విచారకరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వాన్ని నిర్ణయించేది రాజ్యాంగం, చట్టమేనని స్పష్టం చేశారు. భారతీయులు కానివారికి కూడా పాస్ పోర్ట్ ఇవ్వవచ్చని చెప్పారు.
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవుపలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించేముందు చట్టాలని చదవాలని అన్నారు. అయితే ఇటీవల అసదుద్దీన్ ఓవైపీ పాస్ పోర్ట్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జనన ధ్రువీకరణ, ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు కూడా ప్రామాణికం కాకపోతే ఏ పత్రం పౌరసత్వానికి ప్రామాణికం అవుతుందో చెప్పాలని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం రేపు బీజేపీ సభ్యత్వ కార్డు ఉంటేనే పౌరసత్వం ఉన్నట్టు అని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని ఎద్దేవా చేశారు.






