- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ అన్నను ఆ విషయం అడుగుతా: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. స్కై డైవింగ్ చేయాలని తన విష్ లిస్టులో రాసుకున్నట్టు చెప్పారు. బంజీ జంపింగ్ కూడా చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా.. బంజీ జంపింగ్ అంటే తనకు చాలా భయం అని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. స్కై డైవింగ్ చేయాలని తన విష్ లిస్టులో రాసుకున్నట్టు చెప్పారు. బంజీ జంపింగ్ కూడా చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా.. బంజీ జంపింగ్ అంటే తనకు చాలా భయం అని చెప్పారు. ఒక తాడు కట్టుకుని కిందకు దూకడం అంటే అది తెగుతుంది ఏమో అని భయం వేస్తుందని అన్నారు. కానీ ప్యారచ్యూట్ వేసుకుని స్కై డైవింగ్ చేయడం దానికంటే సులభం అని వ్యాఖ్యానించారు. జగనన్న బంజీ జంపింగ్ ఎలా చేశాడో తెలియదు కానీ ఈసారి కలిసినప్పుడు అడుగుతానని చెప్పారు. కేసీఆర్ చాలా కాలంగా మౌనంగా ఉన్నారు? ఎందుకు మాట్లాడడం లేదని యాంకర్ ప్రశ్నించగా గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని అన్నారు.
అది పేలేవరకు సైలెంట్ గానే ఉంటుందని, పేలితే ఓ విస్పోటనం అని వ్యాఖ్యానించారు. తాము అంతా కేసీఆర్ తయారు చేసిన కార్యకర్తలమని, తాము మాట్లాడే ప్రతిమాట కేసీఆర్ మాటేనని అన్నారు. కేసీఆర్ ఇచ్చే డైరెక్షన్ ప్రకారమే మాట్లాడతామని, ఆయన డైరెక్షన్ ప్రకారమే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రతిసందర్భంలో నాయకుడు ముందు ఉండాల్సిన అవసరంలేదని, నాయకుడు అనేవాడు నడిపిస్తాడని అన్నారు. వెనుక నుండి ఆయన ఓ శక్తిలా ఆశీర్వదిస్తే చాలు అని వ్యాఖ్యానించారు.






