ఎన్ ఆర్​సీ పౌరసత్వంపై మజ్లిస్, కాంగ్రెస్ ​ఓటు రాజకీయాలు : బీజేపీ చీఫ్​రాంచందర్​రావు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారని ఆపార్టీ రాష్ట్ర అద్యక్షులు రాంచందర్​వెల్లడించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శంషాబాద్ చేరుకుని రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుండి రాష్ట్రంలోని దాదాపు 10 జిల్లాల నూతన పార్టీ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని తెలిపారు.

ఎన్ ఆర్​సీ పౌరసత్వంపై మజ్లిస్, కాంగ్రెస్ ​ఓటు రాజకీయాలు : బీజేపీ చీఫ్​రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారని ఆపార్టీ రాష్ట్ర అద్యక్షులు రాంచందర్​వెల్లడించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శంషాబాద్ చేరుకుని రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుండి రాష్ట్రంలోని దాదాపు 10 జిల్లాల నూతన పార్టీ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షుల భారీ సమావేశంలో పాల్గొని, అనంతరం రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమవుతారని వివరించారు. రెండవ రోజు ఉదయం విబిఐటి ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక కాన్​క్లేవ్​పాల్గొని, తరువాత వరంగల్‌లో ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన తర్వాత, ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ ప్రెసిడెంట్స్ సమావేశంలో పాల్గొంటారు.

చివరి రోజు ఘట్‌కేసర్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ, ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన ఢిల్లీకి తిరుగుపయనమవుతారని, ఈ పర్యటన పూర్తిగా పార్టీ సంస్థాగత బలోపేతానికి ఉద్దేశించినదే తప్ప ఎన్నికలతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. నీటి వాటాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ప్రతిపాదించిన నవేలి రిజర్వాయర్ (35 టీఎంసీలు), ఆంధ్రప్రదేశ్‌లోని గుండ్రేవుల ప్రాజెక్ట్ (20 టీఎంసీలు) తో తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీటి వాటా దెబ్బతిని కేవలం 5 టీఎంసీలు మాత్రమే వచ్చే ప్రమాదం కనిపిస్తోందన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ తో ముఖ్యమంత్రి అంతర్గతంగా ఏం మాట్లాడారో, రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి హామీలు తెచ్చారో ప్రజల ముందు పెట్టాలని కోరారు.

గతంలో కృష్ణా, గోదావరి బేసిన్లలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుల విషయంలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ రాష్ట్రాల మధ్య వివాదాల్లో మధ్యవర్తిగా ఉండి సమస్యలను పరిష్కరించడానికే ప్రయత్నిస్తుందన్నారు. ఎన్‌ఆర్‌సీ , పౌరసత్వ సవరణ చట్టం అంశాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. 2013 బాంబే హైకోర్టు తీర్పు ప్రకారం పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాదన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించడం చట్టవిరుద్ధమని, తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఆ రెండు పార్టీలు గురి చేయవద్దని హెచ్చరించారు.

Next Story