ఉద్యోగులకు 42శాతం ఫిట్ మెంట్ : TGO

by Muthe.Rajitha |

ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ రిపోర్టు తెప్పించుకుని 42శాతం ఫిట్ మెంట్ అమలుచేసేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ గెజిట్ అధికారుల సంఘం(టీజీఓ) కోరింది.

ఉద్యోగులకు 42శాతం ఫిట్ మెంట్  : TGO
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ రిపోర్టు తెప్పించుకుని 42శాతం ఫిట్ మెంట్ అమలుచేసేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ గెజిట్ అధికారుల సంఘం(టీజీఓ) కోరింది. టీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రంగారెడ్డి జిల్లా మైసిగండిలో శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్ సమావేశాన్ని ప్రారంభించారు. ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించనున్న ప్రమాదబీమాపై కార్యవర్గ సమావేశం హర్షం వ్యక్తంచేసింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ‘తెలంగాణ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డుల మార్గదర్శకాలను విడుదల చేసి వైద్య చికిత్సలను అమలు చేసి ప్రారంభించాలి. పెన్షనర్లకు నెలకు రూ.2వేల కోట్ల బకాయిల విడుదలతో పాటు, రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి.

పెండింగ్ లో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలో కాoట్రీ బ్యూషన్ పెన్షన్ (సీపీఎస్)ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) ను పునరుద్దరించాలి. సెప్టెంబర్ 2024 ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకం అయిన వారికి వెంటనే (ఓపీఎస్) ను అమలు చేయాలి’ వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం నాయకులతోపాటు 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, యుసచివాలయం, హైదరాబాద్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 76 శాఖల ఫోరమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు, మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Next Story