మర్డర్ కేసును చేధించిన పోలీసులు.. భార్య-కూతురు-అల్లుడు అరెస్ట్

by Kodari Anjali |   (  Updated:2026-06-26 12:30:37  IST  )

ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల చేత హత్యకు గురైన కేసును పోలీసులు ఛేదించారు.

మర్డర్ కేసును చేధించిన పోలీసులు.. భార్య-కూతురు-అల్లుడు అరెస్ట్
X

దిశ, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం అవంచ గ్రామంలో ఈ నెల 23 న ఓ వ్యక్తి హత్యకు గురైన కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. అవంచ గ్రామానికి అమ్మపల్లి యాదయ్య(50) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కూతురిని మిడ్జిల్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. తనకు ఉన్న ఏకర నర (1.5) పొలం తన అల్లుడికి చేయ్యాలి అని తన భార్య అలివేల గత రెండు సంవత్సరాల నుండి ఒత్తిడి చేస్తుంది. అందుకు మృతుడు నిరాకరించాడు. తన భార్యకు అల్లుడితో అక్రమ సంబంధం ఉంది అని తన భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో యాదయ్య (50) ను చంపితేనే భూమి అల్లుని పేరా చేయొచ్చు. రైతు బంధు డబ్బులు వస్తాయి అని, ఎలాగైనా చంపాలని భార్య అలివేల, కూతురు పద్మ, అల్లుడు ఆంజనేయులు కలిసి పథకం రచించుకున్నారు.

ముగ్గురిని అరెస్ట్....

ఈ నెల 23న తన భర్తతో గొడవ పెట్టుకుని కూతురుని అల్లుడ్ని ఇంటికి పిలిచింది. ముగ్గురు కలిసి యాదయ్యతో గొడవ పడ్డారు. అల్లుడు మామ గొంతుపట్టి గోడకేసి కొట్టాడు. కిందపడగానే కూతురు రెండు కాళ్లు పట్టుకుంది. భార్య అక్కడే ఉన్న ఒక రాడ్డు తీసుకొని ఛాతిపై కొట్టి తన వృషణాలను గట్టిగా పిసికింది. మృతుడు అక్కడికక్కడే మరణించాడు. కూతురు అల్లుడు తిరిగి వారి ఊరికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు తన భార్య ఏమీ తెలియనట్టు అనారోగ్యంతో మరణించాడని నమ్మించి అంత్యక్రియలు చేయబోయింది. ఈ క్రమంలో బంధువులు ఛాతిపై ఉన్న గాయాలు చూసి అనుమానం కలిగింది. వారి బంధువైన గడ్డమీది పరశురాములు మృతుని భార్యపై తిమ్మాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి స్టైల్లో మృతుని భార్యను విచారించగా, తాను తన కూతురు అల్లుడు కలిసి హత్య చేశామని అంగీకరించింది. గురువారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ పత్రిక సమావేశంలో నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, తిమ్మాజీపేట ఎస్సై శ్రీనివాసరావు ఆ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story