ఇరాన్ ప్రయాణాలు మానుకోండి.. ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన భారత్

by Ajay Maddhiboyina |

ఇరాన్ వెళ్లే వారికి భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు భారతీయ పౌరులు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది.

ఇరాన్ ప్రయాణాలు మానుకోండి.. ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వెళ్లే వారికి భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు భారతీయ పౌరులు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. అంతే కాకుండా ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు, PIOలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. నిరసనలు, ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం వార్తలను అలాగే వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను నిశితంగా పరిశీలించాలని సూచించింది.

ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోకపోతే, నమోదు చేసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉంటే ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే 50 నగరాలకు ఆందోళనలు విస్తరించాయి. ఆందోళన కారులను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిరసనకారులపై లాఠీ చార్జీతో పాటు బాష్పవాయువు ప్రదర్శిస్తోంది. ఆందోళనలు తీవ్రతరం అవ్వడంతోనే భారత ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.

Next Story