- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబం కోసం 'సూపర్ హ్యూమన్' సాహసం.. సముద్రంలో బాలుడి 4 గంటల పోరాటం
విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం సముద్రపు అలల ఉధృతికి కొట్టుకుపోగా, 13 ఏళ్ల బాలుడు ఆస్టిన్ అపెల్బీ సాహసం ప్రదర్శించి వారి ప్రాణాలను కాపాడాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం సముద్రపు అలల ఉధృతికి కొట్టుకుపోగా, 13 ఏళ్ల బాలుడు ఆస్టిన్ అపెల్బీ సాహసం ప్రదర్శించి వారి ప్రాణాలను కాపాడాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని క్విండాలప్‌లో జనవరి 30న ఈ ఘటన చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆస్టిన్ తన తల్లి జోన్ (47), తమ్ముడు బ్యూ (12), చెల్లెలు గ్రేస్ (8) లతో కలిసి జియోగ్రాఫ్ బేలో ప్యాడిల్ కయాక్‌పై విహరిస్తున్నారు. అయితే, అకస్మాత్తుగా బలమైన గాలులు, భారీ అలలు వారిని సముద్రం లోపలికి ఈడ్చుకు పోయాయి.
అలసిపోని ఈత.. అద్భుత నిర్ణయం
సముద్రంలో చిక్కుకోని పోవడంతో ఒడ్డుకు చేరుకోవడం అసాధ్యమని భావించిన బాలుడు ఆస్టిన్, సాయం కోరడానికి తనే స్వయంగా ఈదుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే లైఫ్ జాకెట్ ధరించి మొదటి 2 గంటల పాటు ఈదుకుంటూ అలలతో పోరాడాడు. అనంతరం లైఫ్ జాకెట్ తన వేగాన్ని తగ్గిస్తోందని గమనించిన ఆ బాలుడు ధైర్యంగా దాన్ని తీసేసి మరో 2 గంటలు ఈదాడు. దాదాపు నాలుగు గంటల తర్వాత ఒడ్డుకు చేరిన ఆస్టిన్, తీవ్ర అలసటతో ఉన్నప్పటికీ మరో 2 కిలోమీటర్లు పరిగెత్తి ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం అందించాడు. ఆస్టిన్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్, హెలికాప్టర్లు, బోట్ల సాయంతో సముద్రంలో గాలింపు చేపట్టింది. సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఒకే ప్యాడిల్ బోర్డును పట్టుకుని వేలాడుతున్న ఫ్యామిలీని గమనించారు. ఎట్టకేలకు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సూపర్ హ్యూమన్ సాహసమే..
ఈ ఘటనపై నేచురలిస్ట్ వాలంటీర్ మెరైన్ రెస్క్యూ కమాండర్ మాట్లాడుతూ.. ఆ బాలుడి పట్టుదల, ధైర్యం మాటల్లో చెప్పలేనివని, తన ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడాడని మెచ్చుకున్నారు. అది నిజంగా సూపర్ హ్యూమన్ సాహసమేనని పాల్ బ్రెస్లాండ్ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఆస్టిన్ అపెల్బీని రియల్ హీరోగా వైరల్ అవుతున్నాడు.






