- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐర్లాండ్‌లో ఆరేళ్ల చిన్నారిపై దారుణం.. 'గో బ్యాక్ టూ ఇండియా' అంటూ ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి
ఐర్లాండ్‌లో గత కొంత కాలంగా భారతీయులపై జాత్యాహంకార దాడులు పెరిగిపోతున్నాయి

దిశ, వెబ్ డెస్క్: ఐర్లాండ్‌లో (Ireland) గత కొంత కాలంగా భారతీయులపై (Indians) జాత్యాహంకార దాడులు (Racial Attack) పెరిగిపోతున్నాయి. 'ఐర్లాండ్ వదిలి ఇండియాకు వెళ్లిపోండి' అంటూ చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా విచక్షరహితంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారిపై చోటుచేసుకున్న ఓ ఘోరమైన ఘటన అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజేస్తోంది. భారత సంతతికి చెందిన ఓ కుటుంబం గత ఎనిమిదేళ్లుగా వాటర్‌ఫోర్డు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆగస్టు 4న తమ ఆరేళ్ల కుమార్తె ఇంటి బయట ఆడుకుంటుండగా కొందరు అబ్బాయిలు అక్కడి వచ్చి ఆ చిన్నారిపై దాడికి పాల్పడ్డారు. 'గో బ్యాక్ టూ ఇండియా (Go back to India)' అంటూ ఆమె ముఖంతో పాటు వ్యక్తిగత అవయవాలపై దారుణంగా కొట్టారు. అలాగే, నోటికి వచ్చినట్లు జాత్యాంహకార దూషణలు చేశారు. పైగా ఇంతా దారుణానికి పాల్పడిన అబ్బాయిల వయసు కూడా 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని బాధితురాలి తల్లి చెప్పింది.
చిన్నారి తల్లి ఐర్లాండ్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. వారి కుటుంబానికి ఇటీవల ఐరిష్ పౌరసత్వం కూడా లభించింది. ఈ సంఘటన తర్వాత తన కూతురు చాలా భయపడిందని, ఇప్పుడు బయటకు వెళ్ళడానికి కూడా భయపడుతోందని ఆమె తెలిపారు. తమకు ఇక్కడ సురక్షితంగా అనిపించడం లేదని ఆమె వాపోయారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలచి వేసిందని, కుమార్తెపై దాడి జరగకుండా ఆపలేకపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయితే వారికి శిక్ష విధించడం కంటే కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరినట్లు ఆమె తెలిపారు. కాగా, ఐర్లాండ్‌లో చిన్నారిపై ఇలా జాత్యాహంకార దాడి నమోదవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది.






