Assam CM explains: బ్రహ్మపుత్ర నది నీటిని చైనా ఆపేస్తే.. అస్సాం సీఎం వివరణ

by Shamantha N |

భారత్, పాక్ ఘర్షణలతో సింధు నది నీటి ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోగా బ్రహ్మపుత్ర నది నీటిని చైనా భారత్ కు రాకుండా ఆపేస్తుందని పాకిస్తాన్ ప్రచారం చేస్తోంది. దీనికి ప్రతిస్పందనగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కౌంటర్ ఇచ్చారు

Assam CM explains: బ్రహ్మపుత్ర నది నీటిని చైనా ఆపేస్తే.. అస్సాం సీఎం వివరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ ఘర్షణలతో సింధు నది నీటి ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోగా బ్రహ్మపుత్ర నది నీటిని చైనా భారత్ కు రాకుండా ఆపేస్తుందని పాకిస్తాన్ ప్రచారం చేస్తోంది. దీనికి ప్రతిస్పందనగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కౌంటర్ ఇచ్చారు. ‘చైనా బ్రహ్మపుత్ర నీటిని ఆపితే’ అంటూ సోషల్ మీడియా వేదికగా వాస్తవిక విషయాలను వెల్లడించారు. బ్రహ్మపుత్ర నది కేవలం 30 - 35 శాతం మాత్రమే చైనాలో ప్రవహిస్తుంది. అది కూడా టిబెట్ మంచు పర్వత ప్రాంతాల్లో కురిసిన వర్షం ద్వారా వస్తుంది. మిగిలిన 65-70 శాతం నీరు దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాల నుంచి మాన్ సూన్ వర్షాల వల్ల ప్రవహిస్తుంది.

74 ఏళ్లు పాక్ అన్యాయంగా సింధు నీటిని వాడుకుంది

ఈ నది ప్రవాహం చైనా-భారత్ సరిహద్దు వద్ద కేవలం 2,000 –3,000 క్యూసెక్కులు ఉంటుంది. అది గౌహతికి చేరేలోపు వర్షాకాలంలో 15,000 –20,000 క్యూసెక్కులవుతుంది. ఈ నేపథ్యంలో చైనా బ్రహ్మపుత్ర నీటిని నిలిపేస్తే అస్సాంలో వరదలు కొంత తగ్గే అవకాశం ఉందని పాక్ కు హిమంత బిశ్వ శర్మ చురకలంటించారు. చైనా ఇప్పటివరకు ఎప్పుడూ అలాంటి బెదిరింపులు చేసిన దాఖలాలు లేవన్నారు. పైగా ఇలాంటి ఘటన జరిగే అవకాశం తక్కువ అని స్పష్టం చేశారు. పాకిస్తాన్ గత 74 ఏళ్లుగా ఇండస్ ఒప్పందం ద్వారా అన్యాయంగా నీటి ప్రయోజనాలు పొందింది. ఇప్పుడు భారత్ తన హక్కును వినియోగించుకుంటే వారు భయపడుతున్నారన్నారు. బ్రహ్మపుత్ర మన భూభాగం, మన వర్షాలు, కలిసే దానికి శక్తినిస్తాయి. ఇది ఒక్క దేశం మీద ఆధారపడిన నది కాదన్నారు.

Next Story