- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ సీడీఎఫ్ గా ఆసిమ్ మునీర్.. నోటిఫికేషన్ విడుదల
పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)గా ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ నియమితులయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)గా ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ నియమితులయ్యారు. పాక్ షెహబాజ్ ప్రభుత్వం ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. ఆ దేశ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకంతో ఆసిమ్ మునీర్ పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా నిలవనున్నారు. ఐదళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీడీఎఫ్ గా న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా సెక్యూరిటీని కూడా పొందనున్నారు. అంతేకాదు.. ఈ పదవిలో ఉన్నంతకాలం మునీర్ ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు.
పాక్ ఆర్మీ చీఫ్ గా ఆసిమ్ మునీర్ పదవీకాలం నవంబర్ 29తో ముగిసింది. ఆయనకు మరిన్ని అధికారాలను కట్టబెడుతూ సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఇందుకోసమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ పోస్టును క్రియేట్ చేసింది. సీడీఎఫ్ గా మునీర్ ను ప్రకటించే ముందు.. ఆ పదవిపై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. పాక్ ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్ కావాలనే మునీర్ నియామకాన్ని ఆలస్యం చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.






