అమెరికాపై 75 శాతం సుంకాలు వేయండి.. మోడీకి కేజ్రీవాల్ డిమాండ్

by Phanindra |

అమెరికాపై 75 శాతం సుంకాలు వేయాలని ప్రధాని మోడీకి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దేశం అంతా ఈ నిర్ణయానికి మద్దతిస్తుందని ఆయన అన్నారు.

అమెరికాపై 75 శాతం సుంకాలు వేయండి.. మోడీకి కేజ్రీవాల్ డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ ధైర్యం చూపించాలని, యూఎస్ ఉత్పత్తులపై కనీసం 75 శాతం సుంకాలు విధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ‘ప్రధాని ధైర్యం చూపించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. దేశమంతా మీ వెనుకే ఉంది. అమెరికా మన ఎగుమతులపై 50 శాతం సుంకాలు వేస్తోంది. అక్కడి నుంచి వచ్చే దిగుమతులపై మీరు 75 శాతం సుంకాలు వేయండి. దాని వల్ల పడే భారాన్ని మోయడానికి దేశం సిద్ధంగా ఉంది. ఒకసారి ఆ సుంకాలు వేస్తే ట్రంప్ తలవంచుతాడో లేదో తెలుస్తుంది’ అని కేజ్రీవాల్ అన్నారు. అదే సమయంలో యూఎస్ నుంచి వచ్చే కాటన్ దిగుమతులకు డిసెంబరు 31 వరకు డ్యూటీ మినహాయింపు ఇవ్వడాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఇలా చేయడం వల్ల అమెరికన్ వ్యవసాయ రంగానికి లబ్ది చేకూరుతుందని, కానీ స్థానిక రైతులు నష్టపోతారని విమర్శించారు.

Next Story