నేపాల్‌లో భద్రతను ఆధీనంలోకి తీసుకున్న ఆర్మీ సైన్యం

by Malleboina Mahesh |   (  Updated:2025-09-10 05:31:05  IST  )

నేపాల్ లో హింస చెలరేగిన క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్‌లో పూర్తి తమ ఆధినంలోకి తీసుకున్నట్లు మంగళవారం రాత్రి ఆర్మీ సైన్యం ప్రకటించింది.

నేపాల్‌లో భద్రతను ఆధీనంలోకి తీసుకున్న ఆర్మీ సైన్యం
X

దిశ, వెబ్ డెస్క్: నేపాల్ లో హింస చెలరేగిన క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్‌లో పూర్తి తమ ఆధినంలోకి తీసుకున్నట్లు మంగళవారం రాత్రి సైన్యం (army) ప్రకటించింది. ఈ కరమంలో నేపాల్‌లో క్రమంగా సాధారణ పరిస్థితులు తిరిగి వస్తున్నాయి. పూర్తిగా సైన్యం రంగంలోకి దిగడంతో బుధవారం తెల్లవారుజాము నుండి ఖాట్మండు, ఇతర నగరాల్లో సైనిక దళాలు మోహరించాయి. నిర్బంధ ఆదేశాలను అమలు చేయడం , ప్రశాంతతను పునరుద్ధరించడం జరిగుతుందని ఆర్మీ అధికారి ప్రకటించారు. ఈ క్రమంలో ఒక ప్రకటనలో.. "క్లిష్ట పరిస్థితిని ఆసరాగా తీసుకుని "సాధారణ పౌరులకు, ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం" కలిగిస్తున్న కొన్ని సమూహాల చర్యలపై సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. "ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో దేశంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి తమ బాధ్యతను నిర్వర్తించడంలో నిరంతరం మద్దతు ఇచ్చినందుకు పౌరులందరికీ మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

నిరసనల సమయంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, నేర కార్యకలాపాలను నియంత్రించే ప్రయత్నాలలో అందరూ సహకరించాలని అభ్యర్థించారు. వివిధ చట్ట విరుద్ధమైన వ్యక్తులు మరియు సమూహాలు ఇప్పటికీ చొరబడి ఉద్యమం పేరుతో విధ్వంసం మరియు దహనం, దోపిడీ, వ్యక్తులపై హింసాత్మక దాడులు, అత్యాచార యత్నాలకు పాల్పడుతున్నందున, దేశంలోని మొత్తం శాంతి భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం విధించిన కర్ఫ్యూ దేశవ్యాప్తంగా 1700 గంటలు కొనసాగుతుందని ప్రకటించారు. ఏది ఏమైనప్పటికి అంతులేని అవినీతి ఆరోపణలు వచ్చిన క్రమంలో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా పై బ్యాన్ విధించడంతో ఆగ్రహించిన యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు చేశారు. దీంతో తలొగ్గిన ప్రధాని, అధ్యక్షుడు, మంత్రులు రాజీనామా చేసి.. నేపాల్ వదిలి వెళ్లిపోయారు.

Next Story