అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. మగ్గురు మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-16 08:06:01  IST  )

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. మగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో (America) మరోసారి కాల్పుల (Firing) మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటినియల్ పార్కులో ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) నిర్వహించిన వెస్ట్ ఫెస్ట్ కార్నివాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకు పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో 8 నెలల శిశువు, 18 ఏళ్ల యువకుడు, 41 ఏళ్ల మహిళ ఉన్నారు.

కాగా, రెండు గుంపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో.. 16 ఏళ్ల యువకుడు వెంటనే తుపాకీతో వారిపైకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజల్లో భయం అలముకుంది. అధికారులు భద్రతను పెంచారు. ఈ హింసాత్మక ఘటనలే చెలరేగితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.

Next Story