అమెరికాలో మరో కొత్త రకం కరోనా వేరియంట్ కలకలం

by Yella Dhawani Reddy |

ఆయా దేశాల్లో కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకోస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు విస్తరిస్తుండగా, తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరో కొత్త వేరియంట్‌ను వైద్యులు గుర్తించారు.

అమెరికాలో మరో కొత్త రకం కరోనా వేరియంట్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా (Corona) మహామ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఆయా దేశాల్లో కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకోస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు విస్తరిస్తుండగా, తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో (America) కరోనా మరో కొత్త వేరియంట్‌ను వైద్యులు గుర్తించారు. మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో దక్షిణాసియాలో గుర్తించిన ఈ వేరియంట్‌కు XFG లేదా స్ట్రాటస్ (Stratus) అనే పేర్లు పెట్టారు. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాపి చెందుతోందని వైద్యులు తెలిపారు. అమెరికాలో మార్చి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 0 కేసులుగా నమోదవ్వగా.. ఏప్రిల్‌లో 2%, మే చివరలో 6%, జూన్ చివర నాటికి 14% కేసులకు పెరిగింది.

ఇక అమెరికాలో అలబామా, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండగా, కనెక్టికట్, జార్జియా, న్యూయార్క్, వర్జీనియా వంటి రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య వేగంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్‌ బారిన పడిన వారికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన, రుచి కోల్పోవడం, ముక్కు బ్లాక్ అవ్వటం, అలసట, తలనొప్పి, వాంతులు వంటి సాధారణ లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. ఈ రకమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

అయితే, ఇది ఓమిక్రాన్ వేరియంట్ కంటే పెద్దగా ప్రమాదకరమైందేమి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. ఇందులో LF.7, LP.8.1.2 అనే రెండు వేరియంట్ల మిశ్రమంగా ఉండడం వల్ల కొన్ని కొత్త లక్షణాలు కనిపించవచ్చని తెలిపింది. అలాగే, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఇక దీనికితోడు అదనంగా, NB.1.8.1, నింబుస్ (Nimbus) అనే మరో వేరియంట్ కూడా అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ఇది తీవ్రమైన గొంతు నొప్పిని కలిగిస్తోందని, ప్రజలు తప్పనిసరిగా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Next Story