కెనడాలో మరో భారతీయ విద్యార్థిని హత్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-28 10:24:31  IST  )

భారత దేశానికి చెందిన యువతి విధి కల్పేష్ భాయ్ మేఘాని (22) కెనడాలో దారుణ హత్యకు గురైంది. గుజరాత్ కు చెందిన ఆమె నయాగర రీజయన్ లో హత్య చేయబడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించింది.

కెనడాలో మరో భారతీయ విద్యార్థిని హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశానికి చెందిన యువతి విధి కల్పేష్ భాయ్ మేఘాని (22) కెనడాలో దారుణ హత్యకు గురైంది. గుజరాత్ కు చెందిన ఆమె నయాగర రీజయన్ లో హత్య చేయబడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. నాలుగేళ్లుగా కెనడాలో ఉంటున్న ఆమె.. పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూనే.. స్టడీస్ కంటిన్యూ చేస్తోంది. అక్కడ లా కోర్సు చదువుతున్న విధి.. పర్మినెంట్ రెసిడెన్సీ కోసం అప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 15వ తేదీన నయాగర రీజియన్ లో తాను ఉంటున్న ఇంటికి వెళ్తున్న క్రమంలో.. గుర్తు తెలియని వ్యక్తులు విధిపై కత్తులతో దాడి చేశారు. ఆమెకు పలుచోట్ల కత్తిగాట్లు కావడంతో.. తీవ్రరక్తస్రావంతో కిందపడిపోగా.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె నేడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు హత్యకేసు నమోదు చేసి.. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్తున్నారు.

విధి హత్యతో.. కెనడాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న అటాక్ ల గురించి మరోసారి చర్చ మొదలైంద. గతేడాది డిసెంబరులోనూ 20 ఏళ్ల మెడికో శివాంక్ అస్వతి టోర్నటో యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలోనే హత్యకు గురయ్యాడు. అలాగే గతేడాది ఏప్రిల్ లోనూ 21 ఏళ్ల హర్సిమ్రత్ రాంధవ కూడా రెండు గ్రూపుల మధ్య జరిగిన షూట్ అవుట్ లో మరణించాడు. ఇలా కెనడాలో భారతీయ విద్యార్థులు హత్యకు గురికావడంపై ఆందోళన మొదలైంది.

Next Story